Kangana Ranaut: వ్యవసాయ బిల్లుపై వ్యాఖ్యానించిన కంగన... కర్ణాటకలో కేసు నమోదు

Karnataka police files case against Bollywood actress Kangana Ranaut
  • వ్యవసాయబిల్లుపై దుష్ప్రచారం చేసేవాళ్లు ఉగ్రవాదులన్న కంగన
  • కోర్టుకు ఫిర్యాదు చేసిన న్యాయవాది
  • కంగనాపై కేసు నమోదు చేయాలంటూ కోర్టు ఆదేశాలు
బాలీవుడ్ నటి కంగనా రనౌత్ పై ఊహించని విధంగా కర్ణాటకలో కేసు నమోదైంది. వ్యవసాయ బిల్లుపై ఆమె ట్విట్టర్ లో చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయని తుముకూరుకు చెందిన ఎల్.రమేశ్ అనే న్యాయవాది ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టులో  ఫిర్యాదు చేశాడు. అతని ఫిర్యాదుపై విచారణ చేపట్టిన న్యాయస్థానం కంగనా రనౌత్ పై కేసు నమోదు చేయాలంటూ పోలీసులను ఆదేశించింది. ఈ క్రమంలో కంగనాపై తుముకూరు పోలీసులు ఐపీసీ 108, 153ఎ, 504 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

ఇటీవల కేంద్రం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ బిల్లులపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై కంగనా ట్వీట్ చేశారు. "నాడు సీఏఏకి వ్యతిరేకంగా తప్పుడు సమాచారం, పుకార్లు వ్యాపింపచేసి అల్లర్లకు కారణమైన వాళ్లే నేడు వ్యవసాయ బిల్లుపైనా దుష్ప్రచారం చేస్తూ దేశంలో భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నారు, వారు ఉగ్రవాదులతో సమానం" అంటూ వ్యాఖ్యలు చేశారు.
Kangana Ranaut
Case
Police
Karnataka
Agri Bill

More Telugu News