వరద నేపథ్యంలో.. చంద్రబాబు ఇంటికి మరోసారి నోటీసులు పంపిన అధికారులు

13-10-2020 Tue 17:17
Officers sends notices to Chandrababu residence
  • కృష్ణానదికి పోటెత్తుతున్న వరద
  • కరకట్టపై ఉండే వారికి నోటీసులిచ్చిన అధికారులు
  • చంద్రబాబుతో పాటు మరో 36 ఇళ్లకు నోటీసులు

అల్పపీడన ప్రభావంతో ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో కృష్ణా నదిలోకి పెద్ద ఎత్తున వరద నీరు వస్తోంది. దీంతో కృష్ణా నది కరకట్టపై ఉండే నివాసాలకు అధికారులు మరోసారి నోటీసులిచ్చారు. టీడీపీ అధినేత చంద్రబాబు నివాసానికి కూడా నోటీసులు పంపారు. చంద్రబాబుతో పాటు మరో 36 ఇళ్లకు నోటీసులు జారీ చేశారు.

భారీ వరద నేపథ్యంలో కరకట్ట వద్ద ఉన్న నివాసాలను ఖాళీ చేయాలని నోటీసుల్లో అధికారులు కోరారు. ప్రజలు ఆ ప్రాంతాన్ని ఖాళీ చేసి సురక్షిత ప్రదేశాలకు వెళ్లాలని సూచించారు. కరకట్ట ప్రాంతంలోని నివాసాల్లోకి ఏ సమయంలోనైనా వరదనీరు చేరవచ్చని అధికారులు హెచ్చరించారు.