రామ్ చరణ్ తదుపరి చిత్రంపై క్లారిటీ ఎప్పుడో!

13-10-2020 Tue 14:01
No clarity on Ram Charans next flick yet
  • 'ఆర్ఆర్ఆర్' పూర్తి చేసే పనిలో చరణ్  
  • ఆ తర్వాత 'ఆచార్య'లో గెస్ట్ రోల్
  • కథ చెప్పిన వెంకీ కుడుముల 
  • ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వని చరణ్  

స్టార్ హీరోలు ఒక చిత్రం సెట్లో ఉండగానే తదుపరి చేసే మరో చిత్రాన్ని కూడా ప్లాన్ చేసుకుంటూ వుంటారు. తద్వారా సినిమాకి, సినిమాకి పెద్దగా గ్యాప్ రాకుండా జాగ్రత్త పడతారు. అయితే, ప్రస్తుతం హీరో రామ్ చరణ్ మాత్రం తన తదుపరి చిత్రాన్ని ఇంకా ఖరారు చేసుకోలేదు. ప్రస్తుతం రాజమౌళితో చరణ్ చేస్తున్న 'ఆర్ఆర్ఆర్' త్వరలో పూర్తవుతుంది. ఆ వెంటనే 'ఆచార్య' షూట్ లో జాయిన్ అవుతాడు. అది గెస్ట్ పాత్ర కాబట్టి త్వరగానే పూర్తవుతుంది.

ఈ క్రమంలో ఆ తర్వాత తాను చేసే పూర్తి స్థాయి చిత్రం ఏమిటన్నది ఇంకా ఫైనల్ కాలేదని అంటున్నారు. ఇప్పటికే 'భీష్మ' ఫేమ్ వెంకీ కుడుముల చరణ్ కి ఓ కథ చెప్పాడు. అది చరణ్ కి నచ్చింది కూడా. అయితే, ఈ దర్శకుడికి తను ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని అంటున్నారు. వెంకీకి ఓకే చెబితే ఈ చిత్ర నిర్మాణాన్ని చేబట్టడానికి యూవీ క్రియేషన్స్ సంస్థ సిద్ధంగా వుంది.

మరోపక్క, తన తండ్రితో పలు హిట్ చిత్రాలు చేసిన ప్రముఖ దర్శకుడు కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో ఓ చిత్రం చేయాలని చరణ్ ఎప్పటి నుంచో కోరుకుంటున్నాడు. తాజాగా రాఘవేంద్రరావు ఓ చిత్రాన్ని ప్రకటించారు. మరి, అందులో చరణ్ హీరోగా నటిస్తాడా? అన్నది కూడా సస్పెన్స్ గానే వుంది. ఏమైనా, తన తదుపరి చిత్రం గురించి అభిమానులు చరణ్ ప్రకటన కోసం ఎదురుచూస్తున్నారు.