తూర్పు గోదావరి జిల్లాలో అంబేద్కర్ విగ్రహం పాక్షికంగా ధ్వంసం

13-10-2020 Tue 13:43
Ambedkar statue vandalized in East Godavari district
  • రాజోలు మండలంలో ఘటన
  • విగ్రహం ముక్కు పగులగొట్టిన దుండగులు
  • కేసు నమోదు చేస్తామన్న పోలీసులు

తూర్పు గోదావరి జిల్లా రాజోలు మండలం కాట్రేనిపాడులో రాజ్యాంగనిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని గుర్తు తెలియని వ్యక్తులు కొద్దిమేర ధ్వంసం చేశారు. విగ్రహం ముక్కు పగులగొట్టారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు విగ్రహాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభిస్తామని తెలిపారు. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది.