అరెస్ట్ భయంతోనే పదేపదే ఢిల్లీకి పరిగెడుతున్నట్టు తాడేపల్లి గుసగుస: బుద్ధా వెంకన్న

13-10-2020 Tue 13:27
He is going to Delhi with the fears of arrest says Budda Venkanna
  • రూ. 43 కోట్ల దోపిడి జరిగిందని సీబీఐ తేల్చింది
  • మిగిలిన లెక్కలు ఈడీ వద్ద ఉన్నాయి
  • ఈయన కోసమే గజదొంగ అనే పదం పుట్టిందేమో

ఏపీ ముఖ్యమంత్రి జగన్ వారం రోజుల వ్యవధిలో రెండో సారి ఢిల్లీకి వెళుతున్నారంటూ వస్తున్న వార్తల నేపథ్యంలో టీడీపీ నేత బుద్ధా వెంకన్న ట్విట్టర్ వేదికగా పరోక్ష విమర్శలు గుప్పించారు.

లక్ష కోట్ల అవినీతి కేసులో అరెస్టు చేస్తారనే భయంతోనే పదేపదే ఢిల్లీకి పరిగెడుతున్నట్టు తాడేపల్లి గుసగుస అని ట్వీట్ చేశారు. రూ. 43 కోట్ల దోపిడీ జరిగిందని సీబీఐ తేల్చిందని అన్నారు. మిగిలిన లెక్కలు ఈడీ వద్ద ఉన్నాయని చెప్పారు. క్విడ్ ప్రోకో, సూట్ కేసు కంపెనీలు, హవాలా సూత్రధారి కోసమే గజదొంగ అనే పదం పుట్టిందేమో అని ఎద్దేవా చేశారు.