దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానంలో అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్న జగన్

13-10-2020 Tue 13:20
jagan will go temple
  • దసరా నవరాత్రుల సందర్భంగా ఈ నెల 21న కార్యక్రమం
  • రాష్ట్ర ప్రభుత్వం తరఫున సమర్పణ
  • ఈ నెల 17 నుంచి 25 వరకు దసరా నవరాత్రి ఉత్సవాలు  

దసరా పండుగ ఉత్సవాలకు ప్రజలు సిద్ధమవుతున్నారు. ఈ నెల 17 నుంచి దసరా కళ కనపడనుంది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఈ పండుగ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. దసరా నవరాత్రి ఉత్సవాలకు సమయం దగ్గరపడుతోన్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ రోజు ఓ ప్రకటన చేసింది.

దసరా పండుగ సందర్భంగా ఈ నెల 21వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం తరఫున విజయవాడ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో అమ్మవారికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పట్టువస్త్రాలు సమర్పించనున్నట్లు ప్రకటించింది. ఈ నెల 17 నుంచి 25 వరకు ఆలయంలో దసరా నవరాత్రి ఉత్సవాలు జరుగుతాయని తెలిపింది.