Madras HC: తప్పుడు ఆరోపణలు చేశారంటూ.. లాయర్ పై మద్రాస్ హైకోర్టు ఆగ్రహం.. రూ. 5 లక్షల ఫైన్!

  • విజిలెన్స్ రిజిస్ట్రార్ పూర్ణిమపై లాయర్ సతీశ్ ఆరోపణలు
  • పీయూసీ పరీక్షలు రాయలేదని పిటిషన్
  • ఒరిజినల్ సర్టిఫికెట్లను చూపించిన చీఫ్ జస్టిస్
Madras HC fines lawyer for false allegations

మద్రాస్ హైకోర్టులో విజిలెన్స్ రిజిస్ట్రార్ గా పని చేస్తున్న పూర్ణిమపై అసత్య ఆరోపణలు చేసిన లాయర్ సతీశ్ కుమార్ పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. రూ. 5 లక్షల జరిమానా విధించింది.

వివరాల్లోకి వెళ్తే, పూర్ణిమ ప్లస్ టూ పరీక్షలు రాయకుండానే నేరుగా ఓపెన్ యూనివర్శిటీలో డిగ్రీ, ఆ తర్వాత మైసూరు యూనివర్శిటీలో న్యాయశాస్త్రం పట్టా పొందారని... ఈ కారణాల వల్ల ఆమెను ఆ విధుల నుంచి తొలగించాలని కోరుతూ సతీశ్ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ ను ప్రధాన న్యాయమూర్తి సాహి విచారించారు.

విచారణ సందర్భంగా పూర్ణిమ సర్టిఫికెట్లను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సతీశ్ కుమార్ కు సాహి చూపించారు. 1984లో జరిగిన ప్లస్ టూ పరీక్షల్లో 711 మార్కులతో ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులైనట్టు మార్కుల జాబితాను చూపించారు. తప్పుడు ఆరోపణలతో పిటిషన్ వేసి, కోర్టు సమయాన్ని వృథా చేశారని ఈ సందర్భంగా జస్టిస్ సాహి మండిపడ్డారు. జరిమానా విధించడమే కాకుండా... లాయర్ సతీశ్ పై కోర్టు ఉత్తర్వుల ఉల్లంఘన కేసు నమోదు చేశారు. ఈనెల 20న విచారణకు హాజరు కావాలని ఉత్తర్వులు జారీ చేశారు.

More Telugu News