ఆంధ్రప్రదేశ్ లో చిన్నారులకు నేటి నుంచి విటమిన్ 'ఏ' సిరప్.. ఏర్పాట్లు చేసిన సర్కారు!

13-10-2020 Tue 11:29
Vitamin A cyrup for AP Childrens
  • ఐదేళ్లలోపు వారికి సిరప్
  • రేచీకటి బారిన పడకుండా చర్యలు
  • వెల్లడించిన ఏపీ ప్రభుత్వం

ఆంధ్రప్రదేశ్ లోని చిన్నారులు రేచీకటి బారిన పడకుండా వైఎస్ జగన్ సర్కారు మరో పథకాన్ని నేటి నుంచి ప్రారంభించింది. ఈ నెల 31 వరకూ అన్ని అంగన్ వాడీ కేంద్రాల్లో ఐదేళ్లలోపు పిల్లలకు విటమిన్ ఏ సప్లిమెంటరీ సిరప్ ను ఉచితంగా అందించాలని నిర్ణయించింది.

"అక్టోబర్ 13 వ తేదీ నుంచి 31 వరకు రాష్ట్ర ప్రభుత్వం 5 సం.ల లోపు పిల్లలందరికీ విటమిన్-ఏ సప్లిమెంటేషన్ సిరప్ ఇస్తుంది.  5 సం. లోపు పిల్లల తల్లితండ్రులు అందరూ దగ్గరలోని అంగనవాడి కేంద్రాన్ని సంప్రదించి మీ పిల్లలకి విటమిన్-ఏ సిరప్ వేయించండి. వారి ఆరోగ్య సురక్షితకు జాగ్రత్త తీసుకోండి" అని జగన్ సర్కారు వెల్లడించింది.