Bay of bengal: కాకినాడ సమీపంలో తీరం దాటిన తీవ్ర వాయుగుండం.. ఏపీ వ్యాప్తంగా విస్తారంగా కురుస్తున్న వర్షాలు

  • 17 కిలోమీటర్ల వేగంతో తీరం వైపు దూసుకొచ్చిన వాయుగుండం
  • తీరం వెంబడి 70 కిలోమీటర్ల వేగంతో గాలులు
  • కోస్తా, తెలంగాణ, విదర్భ, మరాఠ్వాడా ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం
Deep Depression crossed near kakinada

ఏపీని వణికిస్తున్న తీవ్ర వాయుగుండం అనుకున్నట్టే ఈ ఉదయం విశాఖపట్టణం, నర్సాపూర్ మధ్య కాకినాడ సమీపంలో తీరం దాటింది. గంటకు 17 కిలోమీటర్ల వేగంతో తీరంవైపు దూసుకొచ్చిన వాయుగుండం కాకినాడ సమీపంలో భూభాగాన్ని తాకినట్టు అధికారులు తెలిపారు.  

తీరం దాటిన అనంతరం ఇది తొలుత వాయుగుండంగా, ఆ తర్వాత అల్పపీడనంగా మారుతుందని పేర్కొన్నారు. ప్రస్తుతం తీరం వెంబడి 65 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. ఫలితంగా ఏపీ వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. లోతట్టు ప్రాంతాల ప్రాంతాల ప్రజలను ముందు జాగ్రత్త చర్యగా సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. వాయుగుండం ప్రభావంతో కోస్తా, తెలంగాణ, మహారాష్ట్రలోని విదర్భ, మరాఠ్వాడా ప్రాంతాల్లోనూ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అప్రమత్తం చేసింది.

More Telugu News