Corona Virus: నిత్యం ఉపయోగించే వస్తువులపై కరోనా వైరస్ ఎన్ని రోజులుంటుందో చెప్పిన తాజా అధ్యయనం!

Corona virus can survive 28 days in smartphones and stainless steel utensils
  • ఆస్ట్రేలియా నేషనల్ సైన్స్ ఏజెన్సీ పరిశోధన
  • కరెన్సీ నోట్లు, స్మార్ట్‌ఫోన్ స్క్రీన్లపై 28 రోజుల వరకు జీవించగలిగే వైరస్
  • తక్కువ ఉష్ణోగ్రతలో ఎక్కువ కాలం మనగలిగే వైరస్
ప్రస్తుత కరోనా కాలంలో మనం ఏది ముట్టుకోవాలనుకున్నా, ఏది పట్టుకోవాలనుకున్నా భయమే. వైరస్ ఏమూల మాటు వేసి ఉందో తెలియక ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాల్సి వస్తోంది.

అయితే, ఎంత జాగ్రత్తగా ఉన్నప్పటికీ డబ్బులు ముట్టుకోక, సెల్‌ఫోన్ పట్టుకోక తప్పదు. వీటిపై ఒకసారి చేరిన వైరస్ ఎంతకాలం జీవించి ఉంటుందన్న విషయంలో ఇప్పటి వరకు స్పష్టత లేకపోయినా, ఆస్ట్రేలియా నేషనల్ సైన్స్ ఏజెన్సీ తాజా పరిశోధనలో మాత్రం కొంత ఆందోళన కలిగించే అంశాలు వెలుగుచూశాయి.

కరెన్సీ నోట్లు, స్మార్ట్‌ఫోన్ స్క్రీన్లు, స్టెయిన్‌లెస్ స్టీల్ వస్తువులపై కరోనా వైరస్ 28 రోజుల వరకు జీవించి ఉంటుందన్నదే ఆ పరిశోధన సారాంశం. దీంతో నిత్య జీవితంలో ఉపయోగించే వస్తువులను కూడా తరచూ శుభ్రం చేసుకుంటూ ఉండాలని, వాటిని పట్టుకున్న ప్రతిసారి చేతులను శుభ్రం చేసుకోవాలని పరిశోధకులు సూచించారు. తక్కువ ఉష్ణోగ్రతలో వైరస్  ఎక్కువ కాలం జీవిస్తుందని, సున్నితంగా ఉండే ఉపరితలాలపై అది మరింత ఎక్కువ కాలం జీవించి ఉంటుందని పేర్కొన్నారు. 20 డిగ్రీల ఉష్ణోగ్రతలో కరోనా వైరస్ 28 రోజులపాటు మనుగడ సాధిస్తుందని గుర్తించినట్టు వివరించారు.
Corona Virus
Australia
Research
smart phones
currency notes

More Telugu News