తండ్రి కాబోతున్న క్రికెటర్ జహీర్ ఖాన్!

13-10-2020 Tue 08:40
Zaheer Khan Wife Sagarika Pregnent
  • ఇటీవల దుబాయ్ లో జహీర్ పుట్టినరోజు
  • బేబీ బంప్ తో కనిపించిన సాగరిక
  • అధికారికంగా ప్రకటించాలంటున్న అభిమానులు

ఈ సంవత్సరంలో తల్లి కాబోతున్న సెలబ్రిటీల జాబితాలో అనుష్కా శర్మ, కరీనా కపూర్ లతో పాటు సాగరికా ఘట్గే కూడా చేరబోతోంది. క్రికెటర్ జహీర్ ఖాన్ ను సాగరిక వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ జంట తమ తొలి బిడ్డను ఆహ్వానించనుందని 'ముంబై మిర్రర్' ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది.

గత వారంలో యూఏఈలో జహీర్ బర్త్ డే వేడుకలు జరుగగా, సాగరిక అక్కడ కనిపించింది. ఈ వేడుకల్లో ఆమె, బ్లాక్ డ్రస్ లో ఉండగా, బేబీ బంప్ కనిపిస్తుండటమే ఈ వార్తలకు కారణం. అధికారికంగా ఈ విషయాన్ని ఈ జంట ప్రకటించనప్పటికీ, జహీర్ పుట్టిన రోజు వేడుకలు చూసిన వారంతా సాగరిక గర్భవతని తేల్చేశారు. ఈ ఫొటోకు 1.37 లక్షలకు పైగా లైక్స్ రాగా, ఈ శుభవార్తను అధికారికంగా ప్రకటించాలని కామెంట్లు వస్తున్నాయి.