రోజుల బిడ్డతో డ్యూటీకి వచ్చిన ఐఏఎస్ అధికారిణి... చిత్రాలు వైరల్!

13-10-2020 Tue 08:36
IAS Officer On Duty With Born Baby
  • యూపీ ఐఏఎస్ అధికారిణి సౌమ్యా పాండే
  • కాన్పు తరువాత సెలవు తీసుకోకుండా విధుల్లోకి
  • సౌమ్య నిబద్ధతపై ప్రశంసల వర్షం

ప్రయాగ్ రాజ్ కు చెందిన సౌమ్యా పాండే... 2017 బ్యాచ్ ఐఏఎస్ అధికారిణి. సరిగ్గా 23 రోజుల క్రితం ఆమె పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. కావాలనుకుంటే, ఆమెకు ఆరు నెలల వరకూ సెలవు ఉంటుంది. కానీ, కరోనా సమయంలో తన బాధ్యతలను గుర్తెరిగిన ఆమె, చంటి బిడ్డను తీసుకుని డ్యూటీకి తిరిగి వచ్చారు.

ఒళ్లో బిడ్డను పెట్టుకుని తన విధులను నిర్వహిస్తున్న ఆమె ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం సౌమ్యా పాండే, యూపీలోని గజియాబాద్, మోదీనగర్ ఎస్డీఎం (సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్)గా పనిచేస్తున్నారు. కాన్పు తరువాత ఎక్కువ రోజులు విశ్రాంతి తీసుకోకుండా ఆమె శ్రమిస్తుండటాన్ని పలువురు అభినందిస్తున్నారు. వృత్తి పట్ల ఆమె నిబద్ధతపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి.