సింహాచలం అప్పన్న ఆలయంలో ఇత్తడి కానుకలు మాయం

13-10-2020 Tue 07:44
Brass Gifts in Simhachalam temple missing
  • కనిపించకుండా పోయిన ఇత్తడి కానుకలు
  • ఇంటి దొంగల పనేనని అనుమానం
  • నలుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్న పోలీసులు

విజయవాడ కనకదుర్గమ్మ ఆలయ రథంలోని వెండి సింహాల మాయం ఘటనను మర్చిపోకముందే సింహాద్రి అప్పన్న ఆలయంలోని ఇత్తడి కానుకలు మాయమైన ఘటన కలకలం రేపుతోంది. భక్తులు సమర్పించిన దాదాపు 550 కేజీల ఇత్తడి కానుకలు మాయమైన విషయం బయటకు రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.

మరోవైపు, సమాచారం అందుకున్న పోలీసులు ఆలయానికి చేరుకుని విచారణ చేపట్టారు. ఇత్తడి కానుకల మాయం వెనక ఇంటి దొంగల హస్తం ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. పారిశుద్ధ్య కార్మికుల సహకారంతోనే అవి ఆలయం నుంచి బయటకు వెళ్లి ఉంటాయని భావిస్తున్నారు. ప్రస్తుతం నలుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.