సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం  

13-10-2020 Tue 07:19
Rashmika opposite Akhil in his next flick
  • సురేందర్ రెడ్డి సినిమాలో రష్మిక?
  • 'రేడియో మాధవ్'గా విజయ్ సేతుపతి
  • షూటింగ్ మొదలెట్టిన నాగశౌర్య  

*  ప్రస్తుతం 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' చిత్రంలో నటిస్తున్న అఖిల్ అక్కినేని తన తదుపరి చిత్రాన్ని సురేందర్ రెడ్డి దర్శకత్వంలో చేస్తున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటున్న ఈ చిత్రంలో కథానాయికగా రష్మిక నటించే అవకాశాలు వున్నాయి. ఈ విషయంలో దర్శక నిర్మాతలు ప్రస్తుతం ఆమెతో సంప్రదింపులు జరుపుతున్నారని తెలుస్తోంది.
*  ప్రముఖ తమిళ కథానాయకుడు విజయ్ సేతుపతి గతేడాది మలయాళంలో నటించిన 'మార్కొని మత్తయ్' చిత్రాన్ని తెలుగులోకి డబ్ చేస్తున్నారు. 'రేడియో మాధవ్' పేరుతో డబ్ అవుతున్న ఈ చిత్రాన్ని థియేటర్లలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
*  నాగ శౌర్య హీరోగా లేడీ డైరెక్టర్ లక్ష్మీ సౌజన్య దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం షూటింగ్ నిన్నటి నుంచి హైదరాబాదులో జరుగుతోంది. కథానాయిక రీతూ వర్మ కూడా షూటింగులో పాల్గొంటోంది. సితార ఎంటర్ టైన్మెంట్స్ సంస్థ దీనిని నిర్మిస్తోంది.