కర్ణాటక ఆకస్మిక వరదల్లో ఓ స్తంభాన్ని పట్టుకుని ప్రాణాలు నిలుపుకున్న వ్యక్తి 

12-10-2020 Mon 20:46
Youth struck in flash flood in Karnataka
  • బెళగావి జిల్లాను ముంచెత్తిన వర్షాలు
  • జిల్లాలో మెరుపు వరదలు
  • వరద నీటిలో చిక్కుకున్న యువకుడు

కర్ణాటకలో భారీ వర్షాలు కురుస్తుండడంతో కొన్ని ప్రాంతాల్లో మెరుపు వరదలు సంభవిస్తున్నాయి. తాజాగా బెళగావి జిల్లాలోనూ భారీ వర్షాలు ఆకస్మికంగా వరదలు వచ్చాయి.

ఈ పరిస్థితుల్లో ఓ యువకుడు వరదల్లో చిక్కుకుపోయాడు. అయితే అతనికి ఓ స్తంభం ఆలంబనగా నిలిచింది. ఆ స్తంభాన్ని గట్టిగా పట్టుకుని ప్రాణాలు కాపాడుకునేందుకు అతడు పోరాడుతున్న తీరు వీడియో రూపంలో సోషల్ మీడియాలో దర్శనమిస్తోంది. నీటి వేగం తనను బలంగా వెనక్కి నెట్టేస్తున్నప్పటికీ మొండి పట్టుదలతో ఆ స్తంభాన్ని పట్టుకుని ప్రాణాలు నిలుపుకున్నాడు.

దేశంలోని అనేక ప్రాంతాల్లో రుతుపవనాలు ఇంకా నిష్క్రమించలేదు. కర్ణాటకలో కొన్నిరోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. సాధారణ జనజీవనం అస్తవ్యస్తంగా మారింది.