బాలీవుడ్ నటుడిపై విజయ్ దేవరకొండ తమ్ముడి మండిపాటు!

12-10-2020 Mon 20:00
Vijay Devarakondas brother fires on Bollywood actor Gulshan
  • పేదలకు, డబ్బున్న వారికి ఓటు హక్కు తొలగించాలన్న విజయ్
  • తలలో ఒత్తిడి తగ్గించుకోవాలన్న గుల్షన్
  • అవతలి వారు చెప్పింది అర్థం చేసుకోవాలన్న ఆనంద్

ఓటు హక్కు గురించి సినీ హీరో విజయ్ దేవరకొండ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. లిక్కర్ కు ఓట్లు అమ్ముకునే వారికి ఓటు హక్కును తీసేయాలని విజయ్ అభిప్రాయపడిన విషయం తెలిసిందే. బాగా డబ్బున్న వారికి, పేదవారికి, చదువు లేని వారికి కూడా ఓటు ఉండకూడదని చెప్పాడు. ఈ వ్యాఖ్యలను కొందరు సమర్థిస్తుండగా, మరికొందరు విమర్శిస్తున్నారు.

బాలీవుడ్ నటుడు గుల్షన్ విజయ్ పై సెటైరిక్ గా కామెంట్ చేశాడు. తలలో ఉన్న ఒత్తిడిని తగ్గించుకోవడానికి మీకొక హెయిర్ కట్ ను సూచిస్తానని చెప్పాడు. ఈ కామెంట్ పై విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్ దేవరకొండ స్పందించాడు. సోషల్ మీడియా ద్వారా వ్యక్తిగతంగా విమర్శించే ముందు... అవతలి వ్యక్తి ఏం మాట్లాడారనే విషయాన్ని అర్థం చేసుకోవాలని హితవు  పలికాడు.