తండ్రి ఆశీస్సులు అందుకున్న కల్వకుంట్ల కవిత... వీడియో ఇదిగో!

12-10-2020 Mon 19:00
Kalvakuntla Kavitha gets her father CM KCR blessings after she won Nizamabad MLC
  • నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా కవిత విజయం
  • బీజేపీ, కాంగ్రెస్ లకు డిపాజిట్లు గల్లంతు
  • ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ ను కలిసిన కవిత

నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానం కోసం జరిగిన ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల కవిత ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. ఆమెకు 728 ఓట్లు రాగా, బీజేపీకి 56, కాంగ్రెస్ కు 29 ఓట్లు వచ్చాయి.

ఎన్నికల్లో గెలిచిన తర్వాత కవిత తన తండ్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిశారు. హైదరాబాద్ ప్రగతి భవన్ కు వెళ్లిన ఆమె సీఎం కేసీఆర్ పాదాలకు నమస్కరించి, ఆశీస్సులు అందుకున్నారు. ఈ సందర్భంగా ఆమె వెంట నిజామాబాద్ టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు కూడా ఉన్నారు.

కాగా, కవిత అత్యధిక మెజారిటీతో గెలవడం పట్ల టీఆర్ఎస్ శ్రేణుల్లో ఆనందోత్సాహాలు పెల్లుబుకుతున్నాయి. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు డిపాజిట్లు కూడా రాకపోవడం టీఆర్ఎస్ పట్టు నిరూపిస్తోంది.