ముంబయి పవర్ కట్ పై నెటిజన్ల జోకులు... ఆనంద్ మహీంద్రా స్పందన

12-10-2020 Mon 17:12
Anand Mahindra responds to internet memes on Mumbai latest power cut
  • ముంబయిలో ఈ ఉదయం పవర్ కట్
  • విద్యుత్ లైన్లు ట్రిప్ అయ్యాయంటూ మహీంద్రా ట్వీట్
  • కామెడీ లైన్లు మాత్రం చెక్కుచెదరలేదంటూ వ్యాఖ్యలు

ముంబయి మహానగరంలో పవర్ కట్ దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించింది. అందుకు కారణం నెటిజన్ల మీమ్స్. ముంబయి విద్యుత్ అంతరాయంపై ఇంటర్నెట్లో జోకులు పేలుతున్నాయి. ఈ ఉదయం విద్యుత్ ప్రసారానికి అంతరాయం ఏర్పడడంతో నగరం స్తంభించిపోయింది. ఎక్కడి కార్యకలాపాలు అక్కడే నిలిచిపోయాయి.

దీనిపై సామాజిక మాధ్యమాల్లో నవ్వు పుట్టించేలా ఉన్న ఓ జిఫ్ పై ప్రఖ్యాత వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా స్పందించారు. 'ముంబయి పవర్ లైన్లు ట్రిప్ అయ్యాయి... కామెడీ లైన్లు మాత్రం ఇంటర్నెట్ లో చెక్కుచెదరకుండా నిలిచే ఉన్నాయి... కాంతివేగంతో కదులుతున్నాయవి' అంటూ తనదైన శైలిలో ట్వీట్ చేశారు.