ధోనీ కూతురుకి బెదిరింపులపై అఫ్రిది స్పందన!

12-10-2020 Mon 16:54
Afridis reaction on comments on Dhonis daughter
  • భారత క్రికెట్ ను ధోనీ కొత్త పుంతలు తొక్కించాడు
  • అత్యున్నత స్థాయికి తీసుకెళ్లాడు
  • ఆటను ఆటగానే చూడాలి

ఈ ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ప్రదర్శన దారుణంగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జట్టు ఓటమిని జీర్ణించుకోలేకపోతున్న కొందరు సోషల్ మీడియా వేదికగా రెచ్చిపోతున్నారు. ఆటగాళ్లను వ్యక్తిగతంగా దూషిస్తున్నారు. ధోనీ కూతురు పట్ల కూడా కొందరు దారుణ వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో పాకిస్థాన్ మాజీ క్రికెటర్ అఫ్రిదీ స్పందించాడు. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని అన్నాడు. భారత క్రికెట్ ను కొత్తపుంతలు తొక్కించిన వ్యక్తి ధోనీ అని... సీనియర్లు, జూనియర్లను కలుపుకుపోయి భారత్ క్రికెట్ ను అత్యున్నత స్థాయికి తీసుకెళ్లాడని, అలాంటి వ్యక్తి పట్ల ఇలా వ్యవహరించడం సరికాదని అన్నాడు. ఆటను ఆటగా మాత్రమే చూడాలని హితవు పలికాడు.