స్వల్ప లాభాల్లో స్టాక్ మార్కెట్

12-10-2020 Mon 16:37
Stock markets ends in profits
  • 84 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్ 
  • 17 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
  • లాభపడ్డ ఐటీ, టెక్ సూచీలు

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు స్వల్ప లాభాల్లో ముగిశాయి. ఉదయం సెన్సెక్స్ దాదాపు 400 పాయింట్లు లాభపడింది. అయితే ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో లాభాలు హరించుకుపోయాయి. చివరకు సెన్సెక్స్ 84 పాయింట్ల లాభంతో 40,584కి చేరుకుంది. నిఫ్టీ 17 పాయింట్లు పెరిగి 11,931 వద్ద స్థిరపడింది.

ఐటీ, టెక్, హెల్త్ కేర్, ఎఫ్ఎంసీ సూచీలు మినహా మిగిలినవన్నీ నష్టాలను మూటకట్టుకున్నాయి. ఇన్ఫోసిస్, ఐటీసీ, యూపీఎల్, డాక్టర్ రెడ్డీస్, ఏసియన్ పెయింట్స్ తదతర సంస్థలు లాభపడగా... ఎయిర్ టెల్, గెయిల్, జేఎస్ డబ్ల్యూ, టాటా మోటార్స్ తదితర కంపెనీలు నష్టపోయాయి.