KTR: భారీ వర్షాలు కురుస్తున్నాయి... పాత భవనాల యజమానులకు నోటీసులు పంపండి: కేటీఆర్ ఆదేశాలు

  • హైదరాబాదులో భారీ వర్షాలు
  • శిథిల భవనాలను గుర్తించాలన్న కేటీఆర్
  • తక్షణమే ఖాళీ చేయించాలని స్పష్టీకరణ
KTR orders GHMC officials to evacuate people who lived in age old buildings in Hyderabad

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా హైదరాబాదులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్ జీహెచ్ఎంసీ అధికారులను అప్రమత్తం చేశారు. హైదరాబాదు పరిధిలో శిథిలావస్థలో ఉన్న భవనాలను గుర్తించాలంటూ అధికారులను ఆదేశించారు.

పాత భవనాల యజమానులకు నోటీసులు జారీ చేయాలని, ఆ భవనాల్లో నివసిస్తున్న వారిని తక్షణమే ఖాళీ చేయించాలని స్పష్టం చేశారు. ప్రాణ నష్టాన్ని నివారించేందుకే ఈ చర్యలు తీసుకుంటున్నట్టు పాత భవనాల యజమానులకు వివరించాలని కేటీఆర్ జీహెచ్ఎంసీ అధికారులకు సూచించారు.

ఈ వర్షాకాలంలో హైదరాబాద్ నగరం అత్యధిక వర్షపాతాన్ని చవిచూసింది. ఈ క్రమంలో పాత భవంతులు కూలిపోయే ప్రమాదం ఉందని ప్రభుత్వం ఆందోళన చెందుతోంది.

More Telugu News