కాబోయే భర్తతో కాజల్.. ఫొటో వైరల్!

12-10-2020 Mon 15:48
Kajals photo with his fiance going viral
  • గౌతమ్ ను పెళ్లాడనున్న కాజల్
  • ఈనెల 30న పెళ్లి
  • పెళ్లి తర్వాత కూడా నటిస్తానని ప్రకటించిన కాజల్

టాలీవుడ్ లో కొన్నేళ్ల పాటు అగ్రనటిగా కొనసాగిన కాజల్ అగర్వాల్ ప్రేమ వివాహం చేసుకోబోతోంది. ముంబైకి చెందిన వ్యాపావేత్త గౌతమ్ కిచ్లూని పెళ్లాడబోతోంది. వీరిద్దరికీ ఎప్పటి నుంచో పరిచయం ఉంది. ఇది కాస్తా క్రమంగా ప్రేమగా మారి, పెళ్లి వరకు తీసుకొచ్చింది. తాజాగా వీరిద్దరికీ సంబంధించిన పాత ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తన ప్రియుడి సరసన కూర్చొన్న కాజల్ ఫొటో అభిమానులను ఆకట్టుకుంటోంది. ఈ నెల 30న వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారు. పెళ్లి తర్వాత కూడా తాను నటిస్తానని కాజల్ ఇప్పటికే స్పష్టం చేసింది.