Raghu Rama Krishna Raju: రష్యన్ యువతి దూరం నుంచి షాంపేన్ పోస్తే తాగాను... ఏముందిరా ఆ ఫొటోలో..?: రఘురామకృష్ణరాజు

Raghurama Krishnaraju gets anger over false propaganda against him
  • సోషల్ మీడియాలో తనపై దుష్ప్రచారం చేస్తున్నారన్న రఘురామ
  • అది మూడేళ్ల నాటి ఫొటో అని వివరణ
  • ఈ రోజుల్లో ఫంక్షన్లంటే రష్యన్ యువతులు కామన్ అని వ్యాఖ్యలు
ఎంపీ రఘురామకృష్ణరాజు మరోసారి తన ప్రత్యర్థులపైనా, తన పట్ల ట్రోలింగ్ కు పాల్పడుతున్న వారిపైనా ఆగ్రహం వ్యక్తం చేస్తూ, వివరణ ఇచ్చారు. సోషల్ మీడియాలో కొన్నిరోజులుగా తన పాత ఫొటో ప్రచారం చేస్తున్నారని, అదెప్పుడో మూడేళ్ల నాటి ఫొటో అని వివరించారు. అందులో ఓ రష్యన్ యువతి షాంపేన్ పోస్తుండగా, రఘురామకృష్ణరాజు తాగుతున్న దృశ్యం ఉంది. ఈ ఫొటోను రఘురామకృష్ణరాజు మీడియాకు చూపించారు.

"ఈ ఫొటో కోల్ కతాలో కానీ, హైదరాబాద్ లో కానీ తీసినది అయ్యుంటుంది. ఓ తెలుగు ఎంపీ  ఫంక్షన్ లోది అనుకుంటా. ఈ ఫొటోను నేను కూడా ఎప్పుడూ చూసుకోలేదు. బహుశా ఈ ఫొటోను పెద్దలు సుబ్బారెడ్డి గారు అందించారనుకుంటున్నాను, వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు.

ఈ ఫొటోలో చూస్తున్నట్టుగా నేను ఎవరినీ ముట్టుకోలేదు. క్రికెట్ పోటీల్లో విజేతలకు షాంపేన్ అందించడం తెలిసిందే. గెలిచినవాళ్లు కొంచెం నోట్లో పోసుకుంటారు. నేను తాగింది కూడా షాంపేనే. అది పెద్దగా మద్యం కేటగిరీలోకి కూడా రాదు.

ఇక, ఈరోజుల్లో ఫంక్షన్లంటే రష్యన్ యువతులు కామన్ అయిపోయారు. ఆ యువతులు అందరి నోళ్లలోనూ పోస్తూ నా నోట్లోనూ షాంపేన్ పోశారు. ఆ సందర్భంగా నేను ఎవరినీ తాకలేదు... ఆమె దూరంగా ఉండి షాంపేన్ పోసింది. అయినా, నేను కొంచెం షాంపేన్ తాగితే మీకేంట్రా సంతోషం వెర్రివెధవల్లారా ... ఏముందిరా ఆ ఫొటోలో?" అంటూ ఆవేశంగా అన్నారు.

రఘురామకృష్ణరాజు మీడియాకు చూపించిన ఫొటో ఇదే...


Raghu Rama Krishna Raju
Photo
Russian Girl
Champagne
YSRCP

More Telugu News