రణబీర్ కపూర్, అలియా భట్ ల పెళ్లిపై అప్ డేట్!

12-10-2020 Mon 15:21
Update on Ranbir Kapoor and Alia Bhatt marriage
  • బయటకొచ్చిన నీతూ కపూర్ డ్యాన్స్ వీడియో
  • కుమారుడి పెళ్లి కోసం డ్యాన్స్ రిహార్సల్స్ చేస్తోందంటూ వార్తలు
  • ఈ ఏడాది పెళ్లి జరిగే అవకాశమే లేదన్న బంధువు

బాలీవుడ్ ప్రేమ జంట రణబీర్ కపూర్, అలియా భట్ లు పీకల్లోతు ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. వీరిద్దరూ పెళ్లాడబోతున్నారనే వార్తలు కూడా బీటౌన్ లో చక్కర్లు కొడుతున్నాయి. ఈ నేపథ్యంలో రణబీర్ తల్లి నీతూ కపూర్ డ్యాన్స్ చేస్తున్న వీడియో బయటకు రావడం పెద్ద చర్చకు దారితీసింది. తన కుమారుడి పెళ్లికి సంబంధించి రిహార్సల్స్ కోసమే ఆమె డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తోందనే చర్చ ప్రారంభమైంది.

అయితే ఈ పెళ్లి వార్తలను కపూర్ ఫ్యామిలీకి చెందిన ఒక వ్యక్తి కొట్టిపారేశారు. ఈ ఏడాది పెళ్లి జరిగే అవకాశమే లేదని ఆయన తెలిపారు. రణబీర్ తండ్రి రిషి కపూర్ ఏప్రిల్ లో చనిపోయిన నేపథ్యంలో వచ్చే ఏడాది ద్వితీయార్ధంలోనే పెళ్లి ఉంటుందని చెప్పారు. రణబీర్, అలియా కూడా పెళ్లి గురించి ప్రస్తుతం ఆలోచించడం లేదని... వారి పెళ్లికి సమయం పడుతుందని తెలిపారు.