భక్తి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన కంగనా రనౌత్

12-10-2020 Mon 14:26
Kangana Ranaut comments on Bhakthi
  • మతం అనే తేడా లేకుండా చాలా మంది రాముడిని ప్రేమిస్తారు
  • ఎంతో మంది భగవద్గీతను అనుసరిస్తారు
  • కొందరు భక్తిని అపహాస్యం చేస్తున్నారు

హాలీవుడ్ నటి సల్మాహయెక్ ఇటీవల సంచలన ప్రకటన చేసింది. తాను హిందూ దేవత లక్ష్మీదేవిని ధ్యానిస్తానని ట్విట్టర్ ద్వారా తెలిపింది. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భక్తి గురించి ఆమె మాట్లాడారు. మతం, జాతి అనే తేడా లేకుండా చాలా మంది రాముడిని ప్రేమిస్తారని తెలిపింది. ఎంతోమంది భగవద్గీతను అనుసరిస్తారని చెప్పారు. కానీ, మన దేశంలో మాత్రం కొంత మంది భక్తిని అపహాస్యం చేస్తున్నారని మండిపడింది. ఇక్కడ మనం భక్తిని ఎంచుకోవడం లేదని, భక్తే మనల్ని ఎంచుకుంటోందని చెప్పింది. కంగనా బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తోందనే వార్తలు వస్తున్న తరుణంలో... ఆమె ఈ వ్యాఖ్యలు చేయడం ఆసక్తికరంగా మారింది.