శర్వా 'మహాసముద్రం' చిత్రంలో హీరోయిన్ గా అదితి రావు హైదరీ

12-10-2020 Mon 14:14
Aditi Rai Hydari plays female lead role in Sharwanand Mahasamudram
  • అజయ్ భూపతి దర్శకత్వంలో మహాసముద్రం
  • కీలక పాత్ర పోషిస్తున్న సిద్ధార్థ్
  • తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న చిత్రం

శర్వానంద్, సిద్ధార్థ్ ప్రధానపాత్రల్లో అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న నూతన చిత్రం 'మహాసముద్రం'. ఈ చిత్రంలో హీరోయిన్ గా అదితి రావు హైదరీ నటిస్తోందని చిత్ర యూనిట్ తాజాగా ఓ ప్రకటనలో వెల్లడించింది.

లవ్, యాక్షన్, క్రైమ్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్టయిన్ మెంట్స్ బ్యానర్ పై సుంకర రామబ్రహ్మం నిర్మిస్తున్నారు. ఈ సినిమా కథ వైజాగ్ నేపథ్యంలో నడుస్తుందని సమాచారం. 'మహాసముద్రం' చిత్రాన్ని ఒకేసారి తెలుగు, తమిళంలో చిత్రీకరిస్తున్నారు.  

'ఆర్ఎక్స్ 100' చిత్రం తర్వాత అజయ్ భూపతి చేస్తున్న సినిమా ఇదే. ఇక, అదితి రావు హైదరీ తమ చిత్రంలో ఓ లీడ్ రోల్ పోషిస్తున్నారని ఏకే ఎంటర్టయిన్ మెంట్స్ ట్వీట్ చేసింది. గాలిని మోసుకొచ్చే అలలా అదితిరావు హైదరీ మా టీమ్ లో జాయినవుతోంది... ఆమెకు స్వాగతం అంటూ పేర్కొంది.