ఆ పాత్ర పూజ హెగ్డేను వరించేనా?

12-10-2020 Mon 14:06
Does the charecter go to Pooja Hegde
  • గుణశేఖర్ దర్శకత్వంలో 'శాకుంతలం'
  • శకుంతలగా అనుష్క అంటూ ప్రచారం
  • పూజ హెగ్డే కోసం ట్రై చేస్తున్న దర్శకుడు  

ఒక ప్రముఖ దర్శకుడి నుంచి ఒక సినిమా ప్రకటన రాగానే ఇక అందులో నటించే తారలపై రకరకాల వార్తలు ప్రచారంలోకి వచ్చేస్తుంటాయి. ఇప్పుడు దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కించే 'శాకుంతలం' దృశ్య కావ్యం గురించి కూడ అలాంటి వార్తలే టాలీవుడ్ లో ప్రచారం అవుతున్నాయి. 

ఇందులో శకుంతలగా అనుష్క నటించే ఛాన్స్ ఉందని మొదట్లో వార్తలొచ్చాయి. అయితే, తాజాగా పూజ హెగ్డే పేరు ప్రచారంలోకి వచ్చింది. శకుంతల పాత్రకు పూజ అయితే ఫ్రెష్ గా ఉంటుందని దర్శకుడు భావిస్తున్నాడని, ఈ క్రమంలో త్వరలో ఆమెను కలసి కథ చెప్పనున్నారని అంటున్నారు. మరోపక్క, సమంతను కూడా ప్రత్యామ్నాయంగా ఆలోచిస్తున్నారట.

కాళిదాసు విరచిత శకుంతల, దుష్యంతుల కథకు గుణశేఖర్ చక్కని స్క్రీన్ ప్లేతో కూడిన స్క్రిప్టును తయారుచేసుకున్నారని సమాచారం. రానాతో చేయాల్సిన 'హిరణ్య కశ్యప' ప్రాజక్టు ప్రస్తుతానికి హోల్డ్ చేయడంతో, గుణశేఖర్ ఈ 'శాకుంతలం' చిత్రాన్ని రూపొందించే పనిలో పడ్డారు.