లిబియాలో కిడ్నాప్ కు గురైన తెలుగు వారికి విముక్తి
- ఉపాధి కోసం లిబియా వెళ్లిన శ్రీకాకుళం వ్యక్తులు
- భారత్ కు వచ్చే క్రమంలో అపహరణకు గురైన వైనం
- కేంద్రానికి లేఖ రాసిన ఎంపీ రామ్మోహన్ నాయుడు
ఈ విషయం తెలుసుకున్న టీడీపీ ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు ఈ విషయాన్ని పార్లమెంటు సమావేశాల్లో ప్రస్తావించారు. వారి ఆచూకీ కోసం చర్యలు తీసుకోవాలంటూ ఆయన కేంద్రానికి లేఖ కూడా రాశారు. ఈ నేపథ్యంలో, లిబియాలోని భారత దౌత్యాధికారులు ఎంతో శ్రద్ధ తీసుకుని తెలుగు వారిని కిడ్నాపర్ల చెర నుంచి విడిపించారు.
శ్రీకాకుళం వ్యక్తులతో పాటు యూపీ, బీహార్, గుజరాత్ రాష్ట్రాలకు చెందిన మరో నలుగురు కూడా కిడ్నాప్ కు గురయ్యారు. లిబియాలోని భారత దౌత్య అధికారులు తీవ్ర ప్రయత్నాల అనంతరం ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత బందీలకు విముక్తి కల్పించారు.