హైదరాబాద్ వాతావరణానికి కంగనా ఫిదా

12-10-2020 Mon 13:35
Bollywood star actress Kangana Ranaut happy with Hyderabad weather
  • షూటింగ్ కోసం హైదరాబాద్ వచ్చిన కంగనా
  • తలైవి చిత్రంలో నటిస్తున్న బాలీవుడ్ స్టార్
  • హైదరాబాద్ ఎంతో ఆహ్లాదకరం అంటూ ట్వీట్

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ హైదరాబాద్ వాతావరణాన్ని బాగా ఆస్వాదిస్తోంది. కంగనా ఇటీవలే షూటింగ్ కోసం హైదరాబాద్ వచ్చారు. ఆమె నటిస్తున్న జయలలిత బయోపిక్ తలైవి షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిలింసిటీలో జరుగుతోంది. ప్రత్యేకంగా వేసిన అసెంబ్లీ సెట్ లో కంగనాపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. కాగా, హైదరాబాద్ వాతావరణంపై కంగనా ప్రత్యేకంగా స్పందించారు.

హైదరాబాద్ ఎంతో అందంగా, ఆహ్లాదకరంగా ఉందని కితాబిచ్చారు. హిమాలయాల్లో కరిగిన శరద్ ఋతువు ఇక్కడ శీతాకాలంగా మారిందా అన్నట్టుగా ఉందని అభివర్ణించారు. ఉషా కిరణాల రాకతో హైదరాబాద్ ఆకాశం వెలిగిపోతుందని, లేత చలిగాలుల్లో ఉదయ భానుడి వెచ్చదనం కలగలసి మొత్తానికి ఓ మత్తులోకి తీసుకెళుతుందని కంగనా కవితాత్మకంగా ట్వీట్ చేశారు.