అనంతపురం కలెక్టరేట్‌ ఎదుట పెట్రోల్ పోసుకుని అంటించుకుని యువకుడి ఆత్మహత్య

12-10-2020 Mon 13:04
  • తల్లి డ్వాక్రా గ్రూపు డబ్బు కోసం ఫిర్యాదు చేయడానికి వెళ్లిన యువకుడు
  • అధికారుల నుంచి సరైన స్పందన రాకపోవడంతో మనస్తాపం
  • ఆసుపత్రికి తరలించినా దక్కని ప్రాణాలు 

అనంతపురం జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. జిల్లా కలెక్టరేట్ ఎదుట రాజశేఖర్ రెడ్డి అనే యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన తల్లి డ్వాక్రా గ్రూప్ డబ్బుల విషయం గురించి స్పందన కార్యక్రమంలో ఫిర్యాదు చేసేందుకు ఆయన కలెక్టరేట్ కు వెళ్లాడు.

అయితే, అధికారులు సరైన సమాధానం ఇవ్వకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఆ తర్వాత కలెక్టరేట్ ఎదుట పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అక్కడే ఉన్న పోలీసులు హుటాహుటిన అతనిని అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. అప్పటికే ఆయన ప్రాణాలు కోల్పోయారని వైద్యులు ధ్రువీకరించారు.