హైద‌రాబాద్‌లో భారీ వ‌ర్షం.. రోడ్లు జలమయం

12-10-2020 Mon 12:40
rain in hyderabad
  • ఖైర‌తాబాద్‌, సోమాజిగూడ‌, బేగంపేటలో వర్షం
  • దిల్‌సుఖ్‌న‌గ‌ర్‌, క‌ర్మ‌న్‌ఘాట్‌, చార్మినార్ ప్రాంతాల్లోనూ వాన
  • తెలంగాణలోని ప‌లు జిల్లాల్లోనూ భారీ వ‌ర్షం

హైదరాబాద్‌ లోని పలు ప్రాంతాల్లో ఈ ఉదయం భారీ వర్షం, మరికొన్ని ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షం పడింది. పలు ప్రాంతాల్లో రోడ్లపై వర్షం నీరు నిలిచిపోవడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. ఖైర‌తాబాద్‌, సోమాజిగూడ‌, బేగంపేట‌, అల్వాల్‌, బోయిన్‌ప‌ల్లి, తార్నాక‌, కుషాయిగూడ‌, ఈసీఐఎల్‌, నాచారం, ఎల్‌బీన‌గ‌ర్‌, వ‌న‌స్థ‌లిపురం ప్రాంతాల్లో వర్షం పడింది.

అలాగే, దిల్‌సుఖ్‌న‌గ‌ర్‌, క‌ర్మ‌న్‌ఘాట్‌, చార్మినార్‌, మ‌ల‌క్‌పేట‌, మెహిదీప‌ట్నం, గ‌చ్చిబౌలి, మాదాపూర్‌, కొండాపూర్‌, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్‌, ల‌క్డీకాపూల్, కోఠి, సికింద్రాబాద్ ప్రాంతాల్లోనూ భారీ వర్షం కురిసింది. మరోవైపు తెలంగాణలోని ప‌లు జిల్లాల్లోనూ భారీ వ‌ర్షం పడుతోంది.