ప్రముఖ సంగీత ద‌ర్శ‌కుడు రాజన్ క‌న్నుమూత‌

12-10-2020 Mon 11:41
rajan passes away
  • రాజన్-నాగేంద్ర ద్వయంలోని రాజన్ నారోగ్య సమస్యలతో కన్నుమూత
  • తెలుగు, కన్నడ భాషల్లో ఎన్నో సినిమాలకు సంగీత దర్శకత్వం
  • అగ్గి పిడుగు, పూజ‌, పంతుల‌మ్మ‌, మూడుముళ్లు సినిమాలకు సంగీతం

ప్రముఖ సంగీత దర్శకుడు రాజన్‌ (87) అనారోగ్య సమస్యలతో కన్నుమూశారు. బెంగళూరులోని తన నివాసంలో గత రాత్రి ఆయన తుదిశ్వాస విడిచినట్లు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. తెలుగు, కన్నడ భాషల్లో ఎన్నో సినిమాలకు ఆయన‌ సంగీత దర్శకత్వం వహించారు. తన తమ్ముడు నాగేంద్రతో కలిసి సంగీత దర్శకుడిగా ఆయన స్వరాలు అందించేవారు. వారిద్దరు రాజన్‌-నాగేంద్ర ద్వయంగా ప్రసిద్ధులు. 

1952లో విడుదలైన సౌభాగ్య లక్ష్మి సినిమాతో ఆయన సంగీత దర్శకులుగా కెరీర్‌ ప్రారంభించి, 37 సంవత్సరాలపాటు సేవలు అందించారు. తెలుగులో అగ్గి పిడుగు, పూజ‌, పంతుల‌మ్మ‌, మూడుముళ్లు, ప్రేమ ఖైదీ, సొమ్మొకడిది సోకొక‌డిది, రెండు రెళ్లు ఆరు, నాగ‌మ‌ల్లి, పులి బెబ్బులి, కిలాడీ దొంగ‌లు తదిత‌ర సినిమాల‌కు సోదరుడితో కలసి రాజ‌న్ సంగీతం అందించారు. ఆయ‌న మృతి పట్ల సినీ ప్ర‌ముఖులు సంతాపం వ్య‌క్తం చేస్తున్నారు. ఇదిలా ఉంచితే, రాజన్ తమ్ముడు నాగేంద్ర ఇరవై ఏళ్ల క్రితమే హృద్రోగంతో మరణించారు.