Nara Lokesh: హింసించే 24వ రాజు వైఎస్ జగన్ మాట మార్చి, మడమ తిప్పి నేటికి 300 రోజులు: లోకేశ్

lokesh slams jagan
  • జై అమరావతి ఉద్యమం మొదలై 300 రోజులైంది
  • అరెస్టులు, అవమానాలు, కేసులతో రాబందుల్లా వెంటాడుతున్నారు
  • ఎత్తిన జెండా దించకుండా జై అమరావతి అంటున్న రైతులు
  • ఉద్యమకారులందరికీ శిరస్సు వంచి పాదాభివందనం  
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ పై టీడీపీ నేత నారా లోకేశ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. అమరావతి రైతుల పోరాటం 300వ రోజుకు చేరిన నేపథ్యంలో ఆయన స్పందిస్తూ... ‘ముందుతరాలకు కూడా మేలు చేయడానికి దార్శనికతతో చేసే పనులు కొన్ని ఉంటాయి. ఉదాహరణకు రాజధానిగా అమరావతి నిర్మాణం. వ్యక్తిగత ప్రయోజనాల కోసం స్వార్థపరులు చేసే పనులు కొన్ని ఉంటాయి. అదే మూడు రాజధానుల నాటకం. మూడు రాజధానులతో వచ్చే ముప్పు తెలుసుకుని అమరావతిని కాపాడుకుందాం’ అని చెప్పారు.

‘జై అమరావతి ఉద్యమం మొదలై 300 రోజులైంది. హింసించే 24వ రాజు వైఎస్ జగన్ మాట మార్చి, మడమ తిప్పి నేటికి 300 రోజులు. అరెస్టులు, అవమానాలు, కేసులతో రాబందుల్లా వెంటాడుతున్నా ఎత్తిన జెండా దించకుండా జై అమరావతి అంటున్న రైతులు, మహిళలు, యువత, ఉద్యమకారులందరికీ శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను’ అంటూ నారా లోకేశ్  ట్విట్టర్ లో పేర్కొన్నారు. 
 
‘మనస్సున్న వాడికి రైతు కష్టం తెలుస్తుంది. మూర్ఖుడికి హింసించడం మాత్రమే తెలుస్తుంది. మనం మూర్ఖుడితో పోరాటం చేస్తున్నాం. ఇదొక సుదీర్ఘ పోరాటం. ఓర్పు, సహనంతో ఉంటే అంతిమ విజయం మనదే’ అని నారా లోకేశ్ ట్వీట్లు చేశారు.
Nara Lokesh
Telugudesam
YSRCP
Amaravati

More Telugu News