టీఆర్పీ రేటింగ్ స్కామ్... రిపబ్లిక్ టీవీ సీఈఓ, సీఓఓలపై పోలీసుల ప్రశ్నల వర్షం!

12-10-2020 Mon 08:15
Republic TV Employees Questioned by Mumbai Police
  • సీఈఓను 9 గంటలు విచారించిన ముంబై పోలీసులు
  • 20 గంటల పాటు మా ఉద్యోగులను ప్రశ్నించారు
  • ఒత్తిళ్లకు తలొగ్గబోమన్న రిపబ్లిక్ టీవీ

దేశవ్యాప్తంగా కలకలం రేపిన టీఆర్పీ రేటింగ్ స్కామ్ లో రిపబ్లిక్ టీవీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వికాస్ ఖాన్ చందానీ, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ హర్ష్ భండారీలపై ముంబై పోలీసులు ప్రశ్నల వర్షం కురిపించారు. వికాస్ ను 9 గంటల పాటు, భండారీని 5 గంటల పాటు పోలీసులు ప్రశ్నించారు.

ఈ విషయమై స్పందించిన రిపబ్లిక్ టీవీ, తమ ఉద్యోగులను ఆదివారం నాడు పోలీసులు 20 గంటల పాటు ప్రశ్నించారని, పత్రికా స్వేచ్ఛను అడ్డుకునే ఒత్తిళ్లకు తాము తలొగ్గబోమని స్పష్టం చేసింది. ఈ స్కామ్ లో హంస ఏజన్సీ ఇచ్చిన ఫిర్యాదు కాపీని ఎలా సంపాదించారని తమ ఉద్యోగులను ప్రశ్నించగా, అది ఎడిటోరియల్ విభాగానికి సంబంధించిన విషయమని సమాధానం ఇచ్చామని పేర్కొంది. హంస ఏజెన్సీ ఫిర్యాదులో తమపై ఏ విధమైన ఆరోపణలు లేవన్న విషయాన్ని ప్రస్తావించింది.