సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం 

12-10-2020 Mon 07:16
Kajal in Quantico Hindi remake
  • నెట్ ఫ్లిక్స్ సీరీస్ లో కాజల్ అగర్వాల్ 
  • బోయపాటితో దిల్ రాజు ప్రాజక్టు
  • విజయ్ దేవరకొండ సిక్స్ ప్యాక్

*  గతంలో ప్రియాంక చోప్రా చేసిన అమెరికన్ టీవీ సీరీస్ 'క్వాంటికో'ను హిందీలో రీమేక్ చేస్తున్నారు. ఇందులో కాజల్ అగర్వాల్ లీడ్ రోల్ లో నటిస్తుంది. దీనిని ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్ ఫ్లిక్స్ నిర్మిస్తుంది.
*  ప్రస్తుతం 'వకీల్ సాబ్' చిత్రాన్ని నిర్మిస్తున్న ప్రముఖ నిర్మాత దిల్ రాజు తన తదుపరి చిత్రాన్ని బోయపాటి శ్రీను దర్శకత్వంలో నిర్మించే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ విషయంలో బోయపాటితో దిల్ రాజు చర్చలు జరుపుతున్నారు. గతంలో బోయపాటితో దిల్ రాజు 'భద్ర' చిత్రాన్ని నిర్మించారు.
*  విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న 'ఫైటర్' చిత్రానికి సంబంధించిన తదుపరి షూటింగును త్వరలో ప్రారంభిస్తారు. ఇక ఈ చిత్రం క్లైమాక్స్ కోసం హీరో విజయ్ దేవరకొండ గత కొంత కాలంగా సిక్స్ ప్యాక్ బాడీని మెయింటైన్ చేస్తున్నాడట. ఈ చిత్రాన్ని తెలుగు, హిందీ భాషల్లో ఏకకాలంలో నిర్మిస్తున్నారు.