ఫాంలోకి వచ్చిన ధావన్, రాణించిన అయ్యర్... ఢిల్లీ క్యాపిటల్స్ 162/4

11-10-2020 Sun 21:52
Dhawan gets into touch as Delhi posted reasonable score against Mumbai Indians
  • అబుదాబిలో ఢిల్లీ వర్సెస్ ముంబయి
  • మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్
  • 52 బంతుల్లో 69 పరుగులు చేసిన ధావన్

ఐపీఎల్ నేడు రెండో మ్యాచ్ లో ఢిల్లీ క్యాపిటల్స్, ముంబయి ఇండియన్స్ మధ్య మ్యాచ్ కు అబుదాబి స్టేడియం వేదికగా నిలుస్తోంది. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 162 పరుగులు చేసింది. ఓపెనర్ శిఖర్ ధావన్ ఫాంలోకి రావడం ఢిల్లీకి ఊరట కలిగించే అంశం. ధావన్ 52 బంతుల్లో 69 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ధావన్ 6 ఫోర్లు, 1 సిక్స్ బాదాడు. కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ 33 బంతుల్లో 5 ఫోర్లతో 42 పరుగులు సాధించాడు. ముంబయి బౌలర్లలో కృనాల్ పాండ్య 2, బౌల్ట్ 1 వికెట్ తీశారు.

అనంతరం 163 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన ముంబయి ఇండియన్స్ 6 ఓవర్లలో 1 వికెట్ నష్టానికి 44 పరుగులు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ 5 పరుగులు చేసి అక్షర్ పటేల్ బౌలింగ్ లో వెనుదిరిగాడు. ప్రస్తుతం క్వింటన్ డికాక్ (38 బ్యాటింగ్), సూర్యకుమార్ యాదవ్ (0 బ్యాటింగ్) బరిలో ఉన్నారు.