ట్రంప్ కు కరోనా... తిండి మానేసి గుండెపోటుతో మరణించిన తెలంగాణ వాసి

11-10-2020 Sun 20:35
Trump super fan in Telangana dies of heart attack
  • గతంలో ట్రంప్ కు గుడికట్టిన గుస్సా కృష్ణ
  • ట్రంప్ కు కరోనా సోకడంతో తీవ్ర మనస్తాపం
  • స్వగ్రామంలో  విషాదం

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు ఓ తెలంగాణ వ్యక్తి గుడి కట్టి ఆరాధిస్తున్న సంగతి తెలిసిందే. అతని పేరు గుస్సా కృష్ణ. దురదృష్టవశాత్తు గుస్సా కృష్ణ ఇప్పుడు లేడు. ట్రంప్ కు కరోనా సోకిందని మీడియాలో వార్తలు రావడంతో కృష్ణ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు.

అప్పటినుంచి ఆహారం కూడా తీసుకోకుండా ట్రంప్ విగ్రహం వద్ద రోదిస్తూ గడిపేవాడు. ఇలా కొన్నిరోజులుగా చేస్తుండడంతో కృష్ణ ఆరోగ్యం బాగా దెబ్బతింది. ఈ క్రమంలో గుండెపోటుకు గురై ప్రాణాలు వదిలాడు.

ఈ ఘటనతో కృష్ణ స్వగ్రామం జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం కొన్నె గ్రామంలో విషాదం నెలకొంది. అప్పట్లో ట్రంప్ కు గుడికట్టిన వ్యక్తిగా గుస్సా కృష్ణ పేరు మీడియాలో బాగా వినిపించింది. గుడికట్టడమే కాదు, ట్రంప్ విగ్రహానికి పూజలు కూడా చేసేవాడు. అతడి మరణంతో తల్లిదండ్రుల బాధ వర్ణనాతీతం.