థాయ్ లాండ్ లో ఘోర ప్రమాదం... 17 మంది మృతి

11-10-2020 Sun 20:04
Fatal accident in Thailand causes seventeen more dearhs
  • బస్సును ఢీకొన్న రైలు
  • బస్సు రైల్వే ట్రాక్ దాటుతుండగా ఘటన
  • బుద్ధుడి ఆలయానికి వెళుతున్న భక్తులు
  • 29 మందికి గాయాలు

ప్రముఖ పర్యాటక దేశం థాయ్ లాండ్ లో ఘోర ప్రమాదం జరిగింది. బస్సును రైలు ఢీకొన్న ఘటనలో 17 మంది మరణించారు. 29 మంది గాయపడ్డారు. బౌద్ధ మతానికి చెందిన వేడుకల్లో పాల్గొనేందుకు భక్తులు బ్యాంకాక్ నుంచి చాగోంగ్ సావో ప్రావిన్స్ లోని బుద్దుడి ఆలయానికి వెళుతుండగా ఘటన జరిగింది. బస్సు రైల్వే ట్రాక్ దాటుతున్న సమయంలో రైలు ఢీకొంది.

వేగంగా వస్తున్న రైలు తాకడంతో బస్సు నుజ్జునుజ్జయి ట్రాక్ పై పడిపోయింది. క్రేన్ సాయంతో దీన్ని తొలగించేందుకు సహాయక బృందాలు ప్రయత్నిస్తున్నాయి. కాగా, ఆసుపత్రిలో కొందరు క్షతగాత్రుల పరిస్థితి విషమంగా ఉండడంతో మృతుల సంఖ్య మరింత పెరుగుతుందని భావిస్తున్నారు. ఈ ఘటనతో థాయ్ లాండ్ లో విషాదం నెలకొంది.