అమ్మాయి పుట్టడం కంటే గొప్ప గిఫ్టు ఇంకేముంటుంది?: మహేశ్ బాబు

11-10-2020 Sun 18:51
Tollywood superstar Mahesh Babu says no gift greater than a girl child
  • ఇవాళ అంతర్జాతీయ బాలికా దినోత్సవం
  • ఇన్ స్టాగ్రామ్ లో అభిప్రాయాలు పంచుకున్న మహేశ్
  • ప్రపంచ బాలికలందరికీ శుభాకాంక్షలు తెలిపిన వైనం

ఇవాళ అంతర్జాతీయ బాలికా దినోత్సవం సందర్భంగా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు సోషల్ మీడియాలో తన అభిప్రాయాలను పంచుకున్నారు. ఎవరికైనా అమ్మాయి పుట్టడం కంటే గొప్ప గిఫ్టు ఇంకేమీ ఉండదని తెలిపారు. తనకంటూ ఓ చిన్ని ప్రపంచాన్ని సృష్టించుకునేందుకు ప్రయత్నిస్తున్న నా చిన్నారి సితార పట్ల నేను గర్విస్తున్నాను అంటూ ఓ అమ్మాయికి తండ్రిగా తన మనోగతం వెల్లడించారు.

"మీ కలలను నిర్లక్ష్యానికి గురి కానివ్వొద్దు. మీ గొంతుకను వినిపించండి. ఆత్మస్థైర్యంతో ఉండండి. మీ హక్కులను మీరు సాధించుకోండి. అందరికీ సమాన హక్కులు కల్పించే ప్రపంచంగా దీన్ని మలుచుకుందాం. ఈ సందర్భంగా నా చిన్నారి కూతురికే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న చిన్నారి బాలికలందరికీ శుభాకాంక్షలు" అంటూ మహేశ్ బాబు ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేశారు.