ఏపీలో కరోనా పరిస్థితుల అప్ డేట్ ఇదిగో!

11-10-2020 Sun 18:25
Corona statistics update for AP
  • గత 24 గంటల్లో 75,517 శాంపిల్స్ పరీక్ష
  • 5,210 మందికి పాజిటివ్
  • 30 మంది మృతి

ఏపీలో కరోనా వైరస్ శాంతిస్తున్న దాఖలాలు కనిపిస్తున్నాయి. గత కొన్నివారాలుగా కొత్త కేసులు, మరణాల సంఖ్యలో క్రమంగా క్షీణత నమోదవుతోంది. గడచిన 24 గంటల్లో రాష్ట్రంలో 75,517 శాంపిల్స్ పరీక్షించగా 5,210 మందికి పాజిటివ్ అని నిర్ధారణ అయింది. అదే సమయంలో 30 మంది మృతి చెందారు. అత్యధికంగా ప్రకాశం జిల్లాలో 8 మంది కరోనాతో కన్నుమూశారు. మొత్తం కరోనా మరణాల సంఖ్య 6,224కి పెరిగింది. తాజాగా 5,509 మంది కరోనా నుంచి కోలుకున్నారు.

మొత్తమ్మీద ఏపీలో ఇప్పటివరకు 7,55,727 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 7,03,208 మందికి నయమైంది. ఇంకా 46,295 మంది చికిత్స పొందుతున్నారు.