చిరంజీవి చెల్లెలుగా డ్యాన్సింగ్ స్టార్..?

11-10-2020 Sun 17:08
Saipallavi reportedly known as she gets huge chance in Megastar Chiranjeevi movie
  • మెహర్ రమేశ్ డైరెక్షన్ లో చిరు చిత్రం
  • సాయిపల్లవికి చాన్స్
  • ప్రస్తుతం ఆచార్య చిత్రం చేస్తున్న మెగాస్టార్

మెగాస్టార్ చిరంజీవి దర్శకుడు మెహర్ రమేశ్ కు ఆఫర్ ఇచ్చిన సంగతి తెలిసిందే. తమిళంలో బాక్సాఫీసు హిట్టయిన వేదాలమ్ చిత్రాన్ని ఇక్కడి నేటివిటీకి తగినట్టుగా మార్చి తెరకెక్కించబోతున్నట్టు తెలుస్తోంది. అయితే, ఈ సినిమాలో చిరంజీవి చెల్లెలు పాత్రలో ప్రముఖ హీరోయిన్ సాయి పల్లవి నటించనున్నట్టు ఫిలింనగర్ సర్కిల్స్ లో బలంగా వినిపిస్తోంది.

తమిళంలో అజిత్ హీరోగా నటించిన వేదాలమ్ చిత్రంలో ఆయన చెల్లెలుగా లక్ష్మీమీనన్ నటించింది. ఇప్పుడదే పాత్రను డ్యాన్సింగ్ స్టార్ సాయిపల్లవి దక్కించుకుందని టాలీవుడ్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ సీరియస్ ఫ్యామిలీ డ్రామా చిత్రంలో సాయిపల్లవి ఎలా అలరిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. మెగాస్టార్ చిత్రం కావడంతో ఇప్పుడిదే హాట్ టాపిక్ లా మారింది. ప్రస్తుతం చిరంజీవి ఆచార్య చిత్రంలో నటిస్తున్నారు. కొరటాల శివ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా పూర్తయితే మెహర్ రమేశ్ తో చిత్రం పట్టాలెక్కనుంది.