Kim Jong Un: బాహుబలి క్షిపణిని ప్రపంచానికి ప్రదర్శించిన కిమ్ జాంగ్ ఉన్... వీడియో ఇదిగో!

  • నిన్న ఉత్తర కొరియాలో సైనిక పెరేడ్
  • హాజరైన కిమ్ జాంగ్ ఉన్
  • వీడియో విడుదల చేసిన కొరియన్ మీడియా
Kim Jong Un shows monster missile to the world

ఉత్తర కొరియాలో అధికార వర్కర్స్ పార్టీ 75వ వ్యవస్థాపక దినోత్సవం నిన్న ఘనంగా జరిగింది. ఈ వేడుకలకు దేశాధినేత కిమ్ జాంగ్ ఉన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన సైనిక పెరేడ్ లో భారీ క్షిపణిని ప్రదర్శించారు. ఇది ఖండాంతర అణుక్షిపణిగా భావిస్తున్నారు. దీని సైజు దృష్ట్యా అంతర్జాతీయ మీడియాలో రాక్షస క్షిపణి అని అభివర్ణిస్తున్నారు. కాగా ఓ పెరేడ్ లో బహిరంగంగా ప్రదర్శించిన మిస్సైళ్లలో ఇదే అతిపెద్దది అని అమెరికా శాస్త్రవేత్తల సమాఖ్య పేర్కొంది. ఈ బాహుబలి క్షిపణికి అమెరికా రక్షణ వ్యవస్థల నుంచి తప్పించుకునే సామర్థ్యం ఉన్నట్టు తెలుస్తోంది.

కాగా, ఈ సైనిక ప్రదర్శనకు ఉత్తర కొరియా సైనికులు పెద్ద సంఖ్యలో హాజరు కాగా, అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్న కూడా పెరేడ్ లో పాల్గొన్నట్టు అక్కడి అధికారిక మీడియా ఓ వీడియో విడుదల చేసింది. భారీ మిస్సైల్ వాహనం వెళుతుండగా కిమ్ జాంగ్ ఉన్ అభివాదం చేస్తుండడాన్ని ఈ వీడియోలో చూడొచ్చు. ఇటీవల కాలంలో కిమ్ బహిరంగంగా కనిపించడం చాలా అరుదైన విషయంగా మారింది.


More Telugu News