ఐపీఎల్ నేడు రెండు మ్యాచ్ లు... రాజస్థాన్ పై టాస్ గెలిచిన సన్ రైజర్స్

11-10-2020 Sun 15:14
  • తొలి మ్యాచ్ లో సన్ రైజర్స్ వర్సెస్ రాజస్థాన్
  • బ్యాటింగ్ తీసుకున్న సన్ రైజర్స్
  • రెండో మ్యాచ్ లో ముంబయి వర్సెస్ ఢిల్లీ
SRH has won the toss against Rajastan Royals

యూఏఈ గడ్డపై జరుగుతున్న ఐపీఎల్ లో ఇవాళ రెండు మ్యాచ్ లు జరగనున్నాయి. తొలి మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్... రెండో మ్యాచ్ లో ముంబయి ఇండియన్స్, ఢిల్లీ క్యాపిటల్స్ తలపడనున్నాయి.

కాగా, రాజస్థాన్ రాయల్స్ తో మ్యాచ్ లో సన్ రైజర్స్ టాస్ గెలిచింది. గత మ్యాచ్ లోనూ మొదట బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ ఈ మ్యాచ్ లోనూ బ్యాటింగే ఎంచుకుంది. సన్ రైజర్స్ టీమ్ ఈ మ్యాచ్ కోసం ఓ మార్పు చేసింది. కశ్మీర్ ఆటగాడు అబ్దుల్ సమద్ స్థానంలో ఆల్ రౌండర్ విజయ్ శంకర్ ను జట్టులోకి తీసుకుంది.

ఇక, రాజస్థాన్ రాయల్స్ జట్టులో ఇంగ్లీష్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్, రియాన్ పరాగ్, రాబిన్ ఊతప్ప తుదిజట్టులోకి వచ్చారు. బెన్ స్టోక్స్ చేరికతో రాజస్థాన్ జట్టుకు మరింత  బలం చేకూరుతుందనడంలో సందేహంలేదు. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్ లో మ్యాచ్ ను మలుపుతిప్పగల సామర్ధ్యం స్టోక్స్ కు ఉంది.