‘ఆర్జీవీ మిస్సింగ్’ సినిమాలోంచి అమితాసక్తి కలిగించే పోస్టర్ విడుదల చేసిన వర్మ

11-10-2020 Sun 13:14
RGVzoomin RGV MISSING coming soon starring P K
  • ‘ఆర్జీవి మిస్సింగ్’ సినిమాలోంచి ఇప్పటికే పలు పోస్టర్లు రిలీజ్
  • ఆర్జీవీ మిస్సింగ్ త్వరలో రానుందన్న వర్మ
  • కొత్త పోస్టర్ లో పీకే, ఎమ్మెస్, బీ, మాజీ సీఎం, పప్పు, కేపీ, ఆర్కే  

వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ తీస్తోన్న ‘ఆర్జీవి మిస్సింగ్’ సినిమాలోంచి ఇప్పటికే విడుదలైన పలు పోస్టర్లపై అభిమానులు అమితాసక్తి కనబర్చారు. తాజాగా, ఈ సినిమాలోంచి ఆయన మరో పోస్టర్ ను విడుదల చేశారు. తాను మిస్సైన ఘటనకు సంబంధించిన సినిమా ఇదంటూ ఆయన ఇప్పటికే ప్రకటించారు.

ఈ సినిమాలో తాను కనపడకుండా పోవడంతో దీనిపై విచారణ జరుగుతుందని, అనుమానితులుగా పీకే ఫ్యాన్స్, మెగా ఫ్యామిలీ, మాజీ ముఖ్యమంత్రి, ఆయన కుమారుడు ఉంటారని చెప్పారు. తాజాగా విడుదల చేసిన పోస్టర్ లో పలువురు ప్రముఖులను పోలిన పాత్రలను చూపించారు. ‘ఆర్జీవీ మిస్సింగ్ త్వరలో రానుంది. ఇందులో పీకే, ఎమ్మెస్, బీ, మాజీ సీఎం, పప్పు, కేపీ, ఆర్కే ఉన్నారు’ అని ఆయన ట్వీట్ చేశారు. కాగా, చాలా తక్కువ నిడివి ఉన్న సినిమాలు తీస్తూ రామ్ గోపాల్ వర్మ ఓటీటీలో విడుదల చేస్తోన్న విషయం తెలిసిందే.