వీపు మీద కొట్టండి.. కానీ దయచేసి కడుపు మీద కొట్టకండి: బండ్ల గణేశ్ ఆవేదన

11-10-2020 Sun 12:48
Bandla Ganesh  says dont write fake news
  • ఇది నా విన్నపం
  • నా మీద దయచేసి ఏ విధమైన వార్తలు రాయొద్దు
  • నేను చెప్పే వరకు రాయకండి

తన గురించి వస్తోన్న పలు రకాల వార్తలపై సినీ నిర్మాత బండ్ల గణేశ్ ఆవేదన వ్యక్తం చేశారు. ‘వీపుమీద కొట్టండి. కానీ దయచేసి కడుపు మీద కొట్టకండి... ఇది నా విన్నపం. నా మీద దయచేసి ఏ విధమైన వార్తలు రాయొద్దు. నేను చెప్పే వరకు ఇది నా అభ్యర్థన’ అని బండ్ల గణేశ్ ట్వీట్ చేశారు.

కాగా, చాలా కాలం తర్వాత బండ్ల గణేశ్ తిరిగి ఓ సినిమా తీయనున్నట్లు ఇప్పటికే స్పష్టమైంది. 'నా బాస్ ఓకే చెప్పారు. నా కలలు మరోసారి నిజమయ్యాయి. నా దేవుడు పవన్ కల్యాణ్‌కి ధన్యవాదాలు' అని బండ్ల గణేశ్ ఇటీవల చెప్పిన విషయం తెలిసిందే. గతంలో పవన్ కల్యాణ్‌తో కలిసి బండ్ల గణేశ్ పలు సినిమాలు తీశారు. మరోసారి వీరిద్దరి కాంబినేషన్ లో గబ్బర్ సింగ్ వంటి సూపర్ హిట్ సినిమా రావాలని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. ఈ నేపథ్యంలో తనపై వస్తోన్న పలు రకాల వార్తలపై బండ్ల గణేశ్ ఇలా స్పందించారు.