తన తండ్రిలానే ఈ మాలోకం మతి చెడిపోయింది: విజయసాయి రెడ్డి ఎద్దేవా

11-10-2020 Sun 11:44
vijaya sai slams chandrababu lokesh
  • బాబు నుంచి అసమర్థతను వారసత్వంగా తీసుకున్న చినబాబు
  • సహజ మరణాన్ని అమరావతి లిస్టులో వేసే దుష్ట ప్రచారం
  • ఇంకెంత కాలం అవుట్ ‌డేటెడ్ బుర్ర వాడుతావు మాలోకం?

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు నారా లోకేశ్ పై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. బాబుని చినబాబు మించిపోయాడంటూ ఆయన ట్వీట్ చేశారు.

‘బాబు నుండి అవినీతి, అసమర్థత, అసత్యం వంటి విషయాలను వారసత్వంగా తీసుకున్న చినబాబు ఇప్పుడు బాబునే మించిపోయాడు. వయో భారంతో సంభవించే సహజ మరణాన్ని కూడా తన రియల్ ‌ఎస్టేట్ అడ్డా అమరావతి లిస్టులో వేసే దుష్ట ప్రచారానికి దిగాడు. తండ్రిలానే మాలోకం మతి చెడిపోయింది. ఇంకెంత కాలం అవుట్ ‌డేటెడ్ బుర్ర వాడుతావు మాలోకం?’ అని విజయసాయిరెడ్డి విమర్శలు చేశారు.

కాగా, జగనన్న విద్యాకానుక పథకం గురించి ఓ వర్గ మీడియా ప్రజలకు తెలపడం లేదంటూ విజయసాయిరెడ్డి మరో ట్వీట్ లో విమర్శలు గుప్పించారు. ‘ఆ పసిపిల్లల మోముల్లో వెల్లివిరిసిన ఆనందం పచ్చ మీడియాకు కనిపించడం లేదు. జగనన్న విద్యాకానుక కింద కిట్లు పొందిన విద్యార్థులు దసరా, దీపావళి ఒకేసారి వచ్చినట్టు సంబరపడుతున్నారు. వెలుగు దివ్వెల్లా మెరిసిపోతున్న వారి సంతోషాన్ని చూపించడానికి భజన మీడియాకు మనసొప్పడం లేదు’ అని ఆయన విమర్శించారు.