రాంగోపాల్ వర్మ ఆఫీస్ కు వచ్చి ధర్నాకు దిగిన ‘దిశ’ తండ్రి

11-10-2020 Sun 11:32
disha father protests at varma Office
  • ‘దిశ.. ఎన్‌కౌంటర్’ సినిమా విడుదల ఆపాలని డిమాండ్
  • ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించిన దిశ తండ్రి
  • నవంబరు 26న విడుదల చేయడానికి వర్మ సిద్ధం

హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన దిశ హత్యాచారం, నిందితుల ఎన్‌కౌంటర్‌‌ను ఆధారంగా వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ ‘దిశ ఎన్‌కౌంటర్’ పేరిట సినిమా తీస్తోన్న విషయం తెలిసిందే. ఈ సినిమా విడుదలను ఆపాలని దిశ తండ్రి ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై ఇప్పటికే వాదనలు జరిగాయి. మరోవైపు, నిర్భయ అత్యాచారం తర్వాత జరిగిన అనేక కేసుల ఆధారంగా తాను కల్పిత  కథతో ఈ సినిమా తీస్తున్నానని వర్మ అన్నారు. నవంబరు 26న విడుదల చేయడానికి నిర్ణయం తీసుకున్నారు.

వర్మ వెనక్కి తగ్గకపోవడంతో దిశ తండ్రి ధర్నాకు దిగాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ సినిమా విడుదల నిలిపేయాల్సిందేనంటూ ఈ రోజు ఉదయం హైదరాబాద్ లోని రాం గోపాల్‌ వర్మ కార్యాలయానికి వచ్చి, దాని ఎదుటే ఆయన ధర్నాకు దిగారు. సోషల్ మీడియాలో వస్తోన్న కామెంట్లు తమను కలిచి వేస్తున్నాయని ఆయన అన్నారు. కాగా, ఈ సినిమా విడుదల విషయంలో కోర్టు చెప్పినట్లు నడుచుకుంటామని ఇప్పటికే నిర్మాత నట్టికుమార్ తెలిపిన విషయం తెలిసిందే.