'ఆర్‌ఆర్‌ఆర్‌' నుంచి మరో పోస్టర్ విడుదల

11-10-2020 Sun 10:33
rrr new poster releases
  • అశోక ధర్మ చక్రంతో ఉన్న కొత్త పోస్టర్
  • అల్లూరి, భీమ్ చేతులు కలిపినట్లు పోస్టర్
  • ఎన్టీఆర్‌కు సంబంధించిన టీజర్ ను ఈ నెల 22న విడుదల

'బాహుబలి' సీరీస్ తర్వాత దర్శకుడు రాజమౌళి రూపొందిస్తున్న 'ఆర్ఆర్ఆర్' సినిమా కోసం అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. అసలే రాజమౌళి ఆపై ప్రముఖ స్టార్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ కథానాయకులుగా నటిస్తుండడంతో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. కరోనా వ్యాప్తి నేపథ్యంలో విధించిన లాక్ డౌన్ వల్ల ఆరు నెలల పాటు ఆగిపోయిన షూటింగ్ మళ్లీ ఇటీవలే ప్రారంభమైంది.

ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, రామ్ చరణ్ కు సంబంధించిన టీజర్ అదరహో అనిపించాయి. తాజాగా, ఈ సినిమాలోంచి మరో పోస్టర్ ను ఆర్ఆర్ఆర్ తమ అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. వెనుక అశోక ధర్మ చక్రం, ముందు అల్లూరి, భీమ్ చేతులు కలిపినట్లు ఈ పోస్టర్ ఉంది.

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా వారిద్దరు కలిసిన సీన్ అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. భారీ బడ్జెట్‌తో రాజమౌళి రూపొందిస్తోన్న ఈ సినిమాలోంచి చరణ్‌ పుట్టిన రోజు సందర్భంగా ఇప్పటికే భీమ్‌ ఫర్‌ రామరాజు టీజర్ విడుదలైంది. అల్లూరి సీతారామరాజు పాత్రను ప్రేక్షకులకు పరిచయం చేసింది. కొమరం భీమ్‌గా ఎన్టీఆర్‌కు సంబంధించిన టీజర్ ను ఈ నెల 22న విడుదల చేస్తారు.