leopard: హైదరాబాద్ లో తిరుగుతోన్న చిరుతను ఎట్ట‌కేల‌కు పట్టుకున్న సిబ్బంది

workers traps leopard in hyderabad
  • కొన్ని నెలలుగా ముప్పుతిప్పలు పెడుతోన్న చిరుత
  • మొన్న అర్ధరాత్రి రాజేంద్ర‌న‌గ‌ర్ లో కలకలం
  • రెండు లేగ దూడ‌ల‌ను చంపిన వైనం
  • ఎరవేసి గత అర్ధరాత్రి పట్టుకున్న సిబ్బంది
హైద‌రాబాద్‌ శివారులో కొన్ని నెలలుగా ఓ చిరుత అలజడి రేపుతోన్న విషయం తెలిసిందే. మొన్న అర్ధరాత్రి రాజేంద్ర‌న‌గ‌ర్ వాలంత‌రి రైస్ రిసెర్చ్ సెంట‌ర్ స‌మీపంలోనూ చిరుత రెండు లేగ దూడ‌ల‌ను చంపడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. ఈ విషయంపై స్థానికులు పోలీసులు, అట‌వీశాఖ సిబ్బందికి స‌మాచారం అందించడంతో ఆ చిరుత కోసం వెతికారు.

చిరుత తిరిగిన ప్రాంతాన్ని పరిశీలించి బోన్లు, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, చనిపోయిన దూడలను ఎరగా అక్కడ ఉంచారు. దీంతో గత అర్ధరాత్రి ఆ చిరుత పశువుల పాక వద్దకు వచ్చి అటవీ అధికారులు ఏర్పాటు చేసిన బోనులో చిక్కింది. ఎట్టకేలకు చిరుత చిక్కడంతో తమకు ప్రమాదం తప్పిందని స్థానికులు అంటున్నారు.  చిరుతను పట్టుకున్న అనంతరం అటవీశాఖ అధికారులు దాన్ని జూపార్కుకు తీసుకెళ్లారు.
leopard
Hyderabad

More Telugu News