విజయవాడలో కాల్పుల కలకలం... నడిరోడ్డుపై సీపీ ఆఫీస్ ఉద్యోగి హత్య!

11-10-2020 Sun 08:47
Murder on Vijayawada bypass road
  • శనివారం రాత్రి దారుణ హత్య
  • బైపాస్ రోడ్డులో ఘటన
  • నిందితుల కోసం ప్రత్యేక పోలీసు బృందాలు

గతరాత్రి విజయవాడ నడిబొడ్డున దారుణ హత్య జరిగింది. సీపీ ఆఫీస్ లో పనిచేస్తున్న మహేశ్ అనే యువకుడిని గుర్తు తెలియని దుండగులు తుపాకితో కాల్చి చంపారు. ఈఘటన బైపాస్ రోడ్డులోని సుబ్బారెడ్డి బార్ అండ్ రెస్టారెంట్ సమీపంలో జరిగింది. ఇదే ఘటనలో మరో వ్యక్తి కడుపులోకి కూడా బులెట్లు దిగాయి.

ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులువివరాలు సేకరిస్తున్నారు. ఓ పథకం ప్రకారం ప్రణాళిక వేసిన దుండుగులు, మహేశ్ ను హతమార్చారని పోలీసులు ప్రాధమికంగా నిర్దారించారు. పరారీలో ఉన్న నిందితుల కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని, నిందితుల ఆచూకీ కోసం సమీపంలోని అన్ని సీసీ కెమెరాలనూ పరిశీలిస్తున్నామని సీపీ బత్తిన శ్రీనివాసులు వెల్లడించారు.